Friday, October 30, 2026
Homeతెలంగాణకరీంనగర్జనాభా గణన–2027పై శిక్షణ తరగతులు పూర్తి

జనాభా గణన–2027పై శిక్షణ తరగతులు పూర్తి

📰 Generate e-Paper Clip

  • పాపులేషన్‌ ఎన్యుమరేషన్‌ ప్రక్రియపై అధికారులకు అవగాహన

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

జనాభా గణన–2027 కార్యక్రమంలో భాగంగా రెండో విడత జనాభా వివరాల సేకరణ (పాపులేషన్‌ ఎన్యుమరేషన్‌)పై నిర్వహించిన శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కరీంనగర్‌లో జిల్లా జనాభా గణన అధికారి, ముఖ్య ప్రణాళికాధికారి వి. కిషన్‌రావు పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లాలో జనాభా గణన ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా అదనపు జనాభా గణన అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన సెన్సస్‌ విభాగం అధికారులు తిరుపతి, నగేష్‌ ఈ శిక్షణ తరగతులను నిర్వహించారు. జనాభా గణన కార్యక్రమాన్ని సమన్వయంతో, పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ శిక్షణ దోహదపడనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!