- హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి: డీఈవో వై. తిరుపతిరావు
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 27 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లాలో జాతీయ ప్రతిభా ఆధారిత ఉపకార వేతన పరీక్ష (నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్–ఎన్ఎంఎంఎస్) నవంబర్ 1వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వై. తిరుపతిరావు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్టికెట్లను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షకు ముందుగానే హాల్టికెట్లు సిద్ధం చేసుకొని, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.
