Wednesday, October 28, 2026
Homeతెలంగాణరేకుర్తిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరపాలి

రేకుర్తిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరపాలి

📰 Generate e-Paper Clip

  • అక్రమ నిర్మాణాలు తొలగించాలి: ఏఐఎఫ్‌బీ నేతల డిమాండ్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): నగరంలోని రేకుర్తిలో వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రజావాణిలో కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.సర్వే నంబర్లు 132, 133లోని ప్లాట్‌ నంబరు 119/ఏలో అక్రమ నిర్మాణాలు చేపట్టి, నకిలీ అనుమతి పత్రాలతో ఇంటి నంబరు పొందినట్లు నేతలు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను తొలగించి, ఇంటి నంబరును రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్‌కుమార్‌, కె. బద్రి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!