Tuesday, October 27, 2026
Homeతెలంగాణకామ్రేడ్స్‌ పాషా, నరహరికి ఘన నివాళి

కామ్రేడ్స్‌ పాషా, నరహరికి ఘన నివాళి

📰 Generate e-Paper Clip

  • పేదల భూమి, భుక్తి కోసం రాజీలేని పోరాటాలు చేశారు: ఎస్‌. చందు నాయక్‌

యాచారం, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): పేద ప్రజల భూమి, భుక్తి, ఇతర ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్స్‌ మహబూబ్‌ పాషా, నరహరి తమ ప్రాణమున్నంత వరకు రాజీలేని పోరాటాలు చేశారని సీపీఎం యాచారం మండల కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌. చందు నాయక్‌ అన్నారు.

మంతన్‌ గౌరెల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్స్‌ మహబూబ్‌ పాషా, నరహరి 37వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద ప్రజల హక్కుల కోసం వారు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం యాచారం మండల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీటీసీ కే. తావు నాయక్‌, పార్టీ నాయకులు బట్టు జంగయ్య, కే. కుమార్‌, కే. గణేష్‌, ఎస్‌. పంతు నాయక్‌తో పాటు గ్రామస్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!