కరీంనగర్, అక్టోబర్ 26 (చైతన్యగళం): వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలను అనుసరిస్తూ విద్యకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం కరీంనగర్‌లోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మానవ జీవితానికి మార్గదర్శకమని, అందులోని నీతి, ధర్మం, సత్యం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
