Wednesday, November 18, 2026
Homeతెలంగాణఅగ్నిమాపక నిబంధనలు పాటించకుంటే చర్యలు

అగ్నిమాపక నిబంధనలు పాటించకుంటే చర్యలు

📰 Generate e-Paper Clip

  • నాలుగు రోజుల్లో లోపాలు సరిచేయాలి.. అగ్నిమాపక అధికారుల హెచ్చరిక

కరీంనగర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలోని పలు వ్యాపార సంస్థలు, ఆసుపత్రుల్లో అగ్నిమాపక అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. శ్రీనివాస్‌రెడ్డి, కేంద్రాధికారి కె. నరేష్‌ సిబ్బందితో కలిసి ముకరంపూరలోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌, సావరన్‌ స్ట్రీట్‌లోని శివానంద పిల్లల ఆసుపత్రి, టవర్‌ రోడ్డులోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ను పరిశీలించారు. మలబార్‌ గోల్డ్‌లో అగ్నిమాపక నిరోధక వ్యవస్థలు పనిచేయకపోవడం, శివానంద ఆసుపత్రిలో పంపులు మరమ్మతుల్లో ఉండటం, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో అగ్నిమాపక పరికరాలు పనిచేయకపోవడం, నేలమాళిగలో దుకాణం ఉండటం, మెట్ల మార్గంలో ఆటంకాలు ఉన్నట్లు గుర్తించారు.నిబంధనల ప్రకారం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసి, విద్యుత్‌ వ్యవస్థను తనిఖీ చేయడంతోపాటు క్రమం తప్పకుండా అగ్నిప్రమాద నివారణ సాధన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు సూచించారు. గుర్తించిన లోపాలను నాలుగు రోజుల్లో సరిచేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే సంబంధిత అనుమతుల అధికారులకు నివేదించి, అగ్నిమాపక చట్టం–1999 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వ్యాపార సముదాయాలు, ఇతర భవనాలను సందర్శించినప్పుడు అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మెట్ల మార్గాలను గుర్తుంచుకోవాలని, ప్రమాదం సంభవిస్తే వీలైనంత త్వరగా సురక్షితంగా బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలని అగ్నిమాపక అధికారి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!