అగ్నిమాపక నిబంధనలు పాటించకుంటే చర్యలు

నాలుగు రోజుల్లో లోపాలు సరిచేయాలి.. అగ్నిమాపక అధికారుల హెచ్చరిక కరీంనగర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలోని పలు వ్యాపార సంస్థలు, ఆసుపత్రుల్లో అగ్నిమాపక అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. శ్రీనివాస్‌రెడ్డి, కేంద్రాధికారి కె. నరేష్‌ సిబ్బందితో కలిసి ముకరంపూరలోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌, సావరన్‌ స్ట్రీట్‌లోని శివానంద పిల్లల ఆసుపత్రి, టవర్‌ రోడ్డులోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ను పరిశీలించారు. మలబార్‌ గోల్డ్‌లో అగ్నిమాపక నిరోధక వ్యవస్థలు పనిచేయకపోవడం, శివానంద ఆసుపత్రిలో పంపులు మరమ్మతుల్లో ఉండటం,...