Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్‌

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్‌

📰 Generate e-Paper Clip

  • రూ.25 లక్షలతో ఏడు ప్రాంతాల్లో వేడుకలకు ఏర్పాట్లు
  • జమ్మికుంట, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు

హుజూరాబాద్‌, అక్టోబర్ 16 (చైతన్యగళం): జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రూ.25 లక్షలతో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు

ఈ సందర్భంగా ప్రణవ్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ప్రభుత్వం రూ.25 లక్షలు కేటాయించిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే అదనంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో ఏడు ప్రాంతాల్లో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యుద్దీపాలంకరణ, వేదిక, తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

జమ్మికుంట మండల, పట్టణ పరిధిలో లబ్ధిదారులకు 28 చెక్కుల ద్వారా మొత్తం రూ.11 లక్షలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంక్షేమ పథకాల అమలుపై ప్రణవ్‌ వివరణ

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రణవ్‌ తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్‌ కార్డుల జారీతో పాటు పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టినట్లు వివరించారు. 18 వేల కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయగా, మరో 22 వేల కార్డులకు అదనపు చేర్పులు, తొలగింపులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

జమ్మికుంట, హుజూరాబాద్‌ పట్టణాల అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరయ్యాయని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైద్య సేవల కోసం డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు రుణమాఫీతో పాటు 67 వేల మంది రైతులకు రైతు భరోసా అందించినట్లు చెప్పారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ప్రమాద బాధితులకు వైద్య సేవల కేంద్రం, అధునాతన శిక్షణ కేంద్రం వంటి వాటిని మంజూరు చేయించినట్లు వివరించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రణవ్‌ పేర్కొన్నారు. గత పదేళ్లలో చేపట్టిన పనులతో పోలిస్తే తమ ప్రభుత్వం తక్కువ సమయంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, అధికారం లేని సమయంలోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు.

ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని చూపిస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, కల్యాణలక్ష్మి వంటి పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. దళితబంధు నిధుల పంపిణీ విషయంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. హుజూరాబాద్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ప్రణవ్‌ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!