- రికార్డులు, కేసు ఫైళ్ల పరిశీలన.. సిబ్బందికి పలు సూచనలు
ఎల్కతుర్తి, నవంబర్ 26 (చైతన్యగళం): కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి గురువారం ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు, కేసు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామ పోలీస్ అధికారి (వీపీఓ) వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, మత్తు పదార్థాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్) కేసుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని సిబ్బందికి తెలిపారు.

