Thursday, October 15, 2026
Homeఆంధ్రప్రదేశ్ఆసుపత్రిలో గోపాల్‌రెడ్డి భార్యకు శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శ

ఆసుపత్రిలో గోపాల్‌రెడ్డి భార్యకు శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శ

📰 Generate e-Paper Clip

నంద్యాల, అక్టోబర్‌ 15 (చైతన్యగళం‌):

నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈర్నపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి భార్యను శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గురువారం పరామర్శించారు. ఆమెపై దాడి జరిగి గాయపడిన విషయం తెలుసుకున్న ఆయన ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి, మెడలోని బంగారు గొలుసును అపహరించినట్లు తెలిసింది. ఈ ఘటనలో గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి బాధితురాలిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!