ఆసుపత్రిలో గోపాల్రెడ్డి భార్యకు శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శ
నంద్యాల, అక్టోబర్ 15 (చైతన్యగళం): నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈర్నపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గోపాల్రెడ్డి భార్యను శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గురువారం పరామర్శించారు. ఆమెపై దాడి జరిగి గాయపడిన విషయం తెలుసుకున్న ఆయన ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి, మెడలోని బంగారు గొలుసును అపహరించినట్లు తెలిసింది. ఈ ఘటనలో గాయపడిన...