- రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
- విద్యుత్ కోతలకు నిరసనగా బీజేపీ ధర్నా.. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
హుస్నాబాద్, అక్టోబర్ 11 (చైతన్యగళం): రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ కోతల వల్ల వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని, దీంతో సాగు చేసిన పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులు విద్యుత్ కోతలతో మరింత నష్టపోతున్నారని పేర్కొన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను నివారించి, సాగునీటి అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయాలని బీజేపీ నాయకులు కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృథ్వీరాజ్ గౌడ్, మండల అధ్యక్షులు బుక్యా సంపత్ నాయక్, రామంచ మహేందర్‌రెడ్డి, జాలిగం రమేష్, దంచనాల శ్రీనివాస్, శ్రీరామోజు శ్రీనివాస్, మంతుర్తి శ్రీకాంత్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు తోట స్వరూప, గుగ్లోత్ తిరుపతి నాయక్, తక్కళ్లపల్లి సంపత్‌రావు, జిల్లా నాయకులు దొడ్డి శ్రీనివాస్, వెల్దండి రాజేంద్రప్రసాద్, మెడబోయిన స్వరూప, బొల్లి శ్రీనివాస్, పిల్లి నర్సయ్య, జనగామ వేణుగోపాల్‌రావు, తోట సమ్మయ్య, తగురం లక్ష్మణ్, చిన్మయి, గొల్లపల్లి విరాచారి, కర్ణకంటి నరేష్, అడేపు శ్రీవర్ధన్, ముష్కర వెంకటేష్, జనగామ కిష్టయ్య, కుంట స్వప్నరెడ్డి, బైరి అరుణ్, తడిసిన రమేష్‌రెడ్డి, మడక రవికుమార్, మునిపాల అశోక్, పెరుమల్ల భరద్వాజ్, పయ్యావుల రాజు, చిదిరాల వెంకటేష్, అల్లి కుమారస్వామి, మ్యాకాల సురేందర్‌రెడ్డి, పకీడే సంపత్, బోయిని మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే భుశంకర చారి, నారోజు నరేష్, పోలోజు రవీందర్, మల్లం ప్రశాంత్, ఎడమల రాజు, మూల లక్ష్మారెడ్డి, కొమ్మిడి సంజీవరెడ్డి, వంగర ముకుందరెడ్డి, దానవేని రమేష్, గుంటి బాలయ్య, బొమ్మగాని రంజిత్, గూగులోత్ లక్పతి, బానోత్ అనిల్‌కుమార్, రైనా నాయక్, గంగుల కుమార్, వేముల ప్రసాద్, ఆవుల కుమార్, రాయికుంట తిరుపతి, గిరిమల రాజు, సుమన్ నాయక్, భూతగడ్డపు బాలరాజు, రాగుల చంద్రశేఖర్‌రెడ్డి, కుంట మల్లయ్య, బాలగోని మల్లేష్, కవ్వ రాంరెడ్డి, ఇటికాల కుమారస్వామి, నారాయణ పోలు శ్రీనివాస్, పెనాల శ్రీనివాస్, పిట్టల సంతోష్, ప్రదీప్, లావుడియా రాజన్ నాయక్, సొల్లు రజనీకాంత్, బొల్లి సుధాకర్, మెరుగు రవీందర్, కొలిపాక కిరణ్, బాసబత్తిని మధు, కే. రమేష్, ఇస్లావత్ తిరుపతి, గంటల రాజేందర్, పుట్ట కొమరయ్య, రాహుల్, నాగరాజు, బత్తుల శ్రీనివాస్, గుర్రాల అశోక్‌రెడ్డి, దొమ్మడి వీరన్న, పోతురాజు సుధాకర్, భాషవేణి కిరణ్, రఘువరన్, కేశవన్ కుమార్, రాజేశ్వరరావు, మోకిడి వినోద్ ఆనంద్, మెరుగు శ్రీనివాస్, గండు సారయ్య, దొంగల వేణు, శనిగరపు ఐలయ్య, బొల్లంపల్లి శ్యామ్, తల్లాపల్లి సతీష్, మదుకర్, కొండ్ర మోహన్ చారి, లాడే ఆదర్శ్, బైరవేని శ్రీనివాస్, గుల్ల తిరుమలేష్, కొల శ్రీనివాస్, కొడం రమేష్, ఠాకూర్ శామ్‌సింగ్, నమిండ్ల ప్రవీణ్, సందేలా సుదర్శన్, సందేలా మధు, సందేలా చందు, గొర్రె చరణ్, సాతురి సురేష్, కోడూరి విక్కీ, కోడూరి హర్షవర్ధన్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
