కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విద్యుత్‌ కోతలకు నిరసనగా బీజేపీ ధర్నా.. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం హుస్నాబాద్‌, అక్టోబర్‌ 11 (చైతన్యగళం): రాష్ట్రంలో విద్యుత్‌ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీజేపీ హుస్నాబాద్‌ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి...