Tuesday, October 13, 2026
Homeతెలంగాణరంగారెడ్డిగ్రామీణ ప్రాంతాలకు బస్సులు యథావిధిగా నడపాలి

గ్రామీణ ప్రాంతాలకు బస్సులు యథావిధిగా నడపాలి

📰 Generate e-Paper Clip

  • డిపో మేనేజర్‌కు పీఆర్‌జీ ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్త వినతి

యాచారం, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): యాచారం మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు గత మూడు రోజులుగా ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన సుమారు 10 బస్సులను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీఆర్‌జీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ప్రొద్దుటూరు రవీందర్‌ గుప్త తెలిపారు. ఈ విషయంపై డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి, బస్సులను యథావిధిగా నడపాలని కోరినట్లు చెప్పారు.

పండుగ సమయంలో బస్సులు నిలిపివేయడంతో మహిళలు నూతన వస్త్రాలు, ఇంటి అవసరాల సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మేనేజర్‌ పూర్తి వివరాలు తెలుసుకుని బస్సులను యథావిధిగా నడిపిస్తామని హామీ ఇచ్చినట్లు రవీందర్‌ గుప్త తెలిపారు.

ఇబ్రహీంపట్నం డిపో నుంచి తాటిపర్తికి రెండు ట్రిప్పులు, కందుకూరుకు రెండు ట్రిప్పులు, మీర్‌ఖాన్‌పేట, అజిలాపురం గ్రామాలకు ఒక్కో ట్రిప్పుతో పాటు మర్రిగూడ, కోదాస్‌పల్లి, మంతన్‌, గౌరెల్లి, మాల్‌ తదితర గ్రామాలకు బస్సులు నిలిపివేసినట్లు డిపో మేనేజర్‌కు వివరించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!