- అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: నల్లమోతు సిద్ధార్థ
మాడ్గులపల్లి, అక్టోబర్ 12 (చైతన్యగళం):
మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పట్టభద్రులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు నమోదుకు అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను సమర్పించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, సర్పంచ్ ఊర ప్రసన్న రాబర్ట్, అల్గుబెల్లి గోవింద్‌రెడ్డి, మస్తాన్, యర్రమళ్ల దినేష్, నకిరేకంటి వేణు, శ్రీను, రియాజ్, అశోక్, జానయ్య, మహేందర్, పృథ్వి, మునగాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
