Tuesday, October 13, 2026
Homeతెలంగాణకరీంనగర్రెడ్‌క్రాస్‌ సొసైటీ విజేతలకు గంగుల అభినందనలు

రెడ్‌క్రాస్‌ సొసైటీ విజేతలకు గంగుల అభినందనలు

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌, అక్టోబర్‌ 12 (చైతన్యగళం): రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ విజేతలకు శాలువాలు కప్పి, పూల మొక్కలు అందించి సత్కరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రజలకు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ సంఘం లక్ష్మణరావు, వైస్‌ చైర్మన్‌ ఊట్కూరి రాధాకృష్ణరెడ్డి, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు కుందారపు మహేశ్వర్‌, కోశాధికారి గోలి శ్రీనివాస్‌, మేనేజింగ్‌ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, పెద్ది విద్యాసాగర్‌, ఎలగందుల మునీందర్‌, సాయినేని నరేందర్‌, కనపర్తి మనోహర్‌రావు, మొగులోలు రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!