పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన
అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: నల్లమోతు సిద్ధార్థ మాడ్గులపల్లి, అక్టోబర్ 12 (చైతన్యగళం): మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పట్టభద్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటరు నమోదుకు అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను సమర్పించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని...