- అక్కన్నపేటలో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా
హుస్నాబాద్ , అక్టోబరు 9 (చైతన్యగళం):
రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్ చౌరస్తా నుంచి విద్యుత్ ఉపకేంద్రం వరకు ఆందోళన చేపట్టారు. విద్యుత్ కోతలను ఎత్తివేసి వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
పంటలు ఎండిపోయే పరిస్థితి
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించాలని కోరుతూ విద్యుత్ శాఖ, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉపకేంద్రం వద్ద నినాదాలు చేశారు.
కోతలు ఎత్తివేయకుంటే ఆందోళనలు ఉధృతం
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కోతలను తక్షణమే ఎత్తివేయాలని, ప్రతి బోరుబావికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు తొలగించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సిద్ధిపేట జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునవతు మోహన్ నాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గులోత్ తిరుపతి నాయక్, జిల్లా సహకార విభాగం కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మేడవెన సరూప, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, మండల ఉపాధ్యక్షుడు బోనగిరి తిరుపతి, మాజీ సర్పంచ్ జిల్లాల అశోక్‌రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గులోత్ లక్పత్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు బానోతు అనీల్, మండల కార్యదర్శి లావుడ్య రైనా నాయక్‌తో పాటు ముక్కి సమ్మిరెడ్డి, లింగారెడ్డి, సంజీవరెడ్డి, బానోతు సుమన్, సలేంద్ర తిరుపతి, గిరిమల రాజు, మాలోత్ రాజు, గంగుల కుమార్, జంగపల్లి శ్రీనివాస్, జంగపల్లి యాదగిరి, తేజ, బల మధు, రాయికుంట తిరుపతి, జీల కనుకయ్య, సత్యనారాయణ, మిట్టపల్లి కుమార్, ఆవుల కుమార్, శ్రీకాంత్, శ్రీనివాస్, సంజీవ్, కుస రాజు, రాజేష్, రమేష్, ముక్కెర అఖిల్, గడ్డం శ్రీకాంత్, గుగులోత్ రాజకుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
