కరెంటు కోతలతో రైతుల గోస!

అక్కన్నపేటలో విద్యుత్‌ కోతలకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా హుస్నాబాద్‌ , అక్టోబరు 9 (చైతన్యగళం): రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి విద్యుత్‌ ఉపకేంద్రం వరకు ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ కోతలను ఎత్తివేసి వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్‌ చేశారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఈ సందర్భంగా...