Saturday, October 10, 2026
Homeక్రైమ్ న్యూస్నాటుసారాతో వ్యక్తి పట్టివేత

నాటుసారాతో వ్యక్తి పట్టివేత

📰 Generate e-Paper Clip

  • 4 లీటర్ల నాటుసారా, ద్విచక్ర వాహనం స్వాధీనం

బయ్యారం(చైతన్యగళం): నాటుసారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బయ్యారం నుంచి స్టేషన్ గుండ్రాతిమడుగు వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న లునావత్ శ్రీనును తనిఖీ చేయగా, అతని వద్ద 4 లీటర్ల నాటుసారా గుర్తించారు.

దీంతో నాటుసారాతో పాటు దానిని తరలించేందుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ రాంప్రసాద్ మాట్లాడుతూ.. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందన్నారు. నాటుసారా వల్ల ప్రజల ఆరోగ్యానికి, కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అక్రమంగా నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా అక్రమ కార్యకలాపాలపై ప్రజలకు సమాచారం తెలిస్తే ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు.

నాటుసారా నియంత్రణలో భాగంగా మండలంలోని వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేస్తామని సీఐ తెలిపారు.

ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు కానిస్టేబుళ్లు రియాజ్, గోపి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!