Sunday, November 1, 2026
Homeతెలంగాణఎస్‌ఐఆర్‌పై ముస్లింల నిరసన

ఎస్‌ఐఆర్‌పై ముస్లింల నిరసన

📰 Generate e-Paper Clip

  • సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌

మహబూబాబాద్‌, అక్టోబరు 8 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌ పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్‌ పట్టణ ముస్లింలు గురువారం అంబేడ్కర్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ముఫ్తీ అలంగీర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కోట్లాది మంది జనాభా ఉండగా అనుమానాల పేరుతో పెద్ద సంఖ్యలో ప్రజలకు నోటీసులు జారీ చేయడం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అనుమానాలకు తావిస్తోందన్నారు. దళిత, మైనార్టీల ఓటు హక్కుకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫరీద్‌ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, రిజర్వేషన్ల కోసం పోరాడిన ప్రజలు ఇప్పుడు ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.

తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై దళిత, ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. జ్ఞానేశ్‌కుమార్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి, పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఓటు హక్కుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన భరోసా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫకీర్‌ ఆసిఫ్‌, ఇస్మాయిల్‌, సయ్యద్‌ అహ్మద్‌ రిజ్వీ, హాఫీజ్‌ అక్బర్‌, ఖయ్యూం, ఖలీల్‌, జమీల్‌, సయ్యద్‌ జాకీర్‌, నదీమ్‌ఖాన్‌, ఫజల్‌, నయీమ్‌, యూసుఫ్‌, మహబూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!