నాటుసారాతో వ్యక్తి పట్టివేత

4 లీటర్ల నాటుసారా, ద్విచక్ర వాహనం స్వాధీనం బయ్యారం(చైతన్యగళం): నాటుసారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బయ్యారం నుంచి స్టేషన్ గుండ్రాతిమడుగు వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న లునావత్ శ్రీనును తనిఖీ చేయగా, అతని వద్ద 4 లీటర్ల నాటుసారా గుర్తించారు. దీంతో నాటుసారాతో పాటు దానిని తరలించేందుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు...