Saturday, October 10, 2026
Homeతెలంగాణమెదక్మహిళా కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ ఎన్‌ఎస్‌యూఐ నిరసన

మహిళా కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ ఎన్‌ఎస్‌యూఐ నిరసన

📰 Generate e-Paper Clip

  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: సాదుల పవన్‌కుమార్‌

సిద్దిపేట, అక్టోబరు 8 (చైతన్యగళం): మహిళా ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులు గురువారం సిద్దిపేటలో నిరసన చేపట్టాయి. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌ రాచకొండ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్‌కుమార్‌ మాట్లాడుతూ మహిళా కార్యకర్తలపై దాడికి యత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఘటనను కేవలం రాజకీయ వివాదంగా చూడకుండా మహిళలపై దాడిగా పరిగణించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బుస్సా వంశీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి సనా, మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రజినీ, ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!