మహిళా కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ ఎన్‌ఎస్‌యూఐ నిరసన
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: సాదుల పవన్‌కుమార్ సిద్దిపేట, అక్టోబరు 8 (చైతన్యగళం): మహిళా ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపిస్తూ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులు గురువారం సిద్దిపేటలో నిరసన చేపట్టాయి. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ రాచకొండ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్‌కుమార్ మాట్లాడుతూ మహిళా కార్యకర్తలపై దాడికి యత్నించడం ప్రజాస్వామ్య...