Wednesday, November 18, 2026
Homeతెలంగాణమెదక్పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

  • బాలల భద్రత, హక్కుల పరిరక్షణపై న్యాయ అవగాహన కార్యక్రమం

సిద్దిపేట, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టం–2012పై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎ. కుమారస్వామి సూచించారు. “సురక్షిత్‌ బచ్పన్‌ అభియాన్‌”లో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైదరాబాద్‌, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ జి. సుదర్శన్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎ. కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు తమ హక్కుల గురించి తెలుసుకోవడంతోపాటు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడి మౌనంగా ఉండకూడదని, వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని చెప్పారు.

పోక్సో చట్టం ద్వారా బాలలకు కల్పించిన రక్షణ, లైంగిక వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పిల్లలకు సురక్షితమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. బాలల భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం, వారిలో ధైర్యాన్ని నింపడం, చట్టపరమైన రక్షణలపై స్పష్టత కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్‌ శ్రీనివాస్‌, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!