Friday, October 9, 2026
Homeతెలంగాణకరీంనగర్శాంతిభద్రతల పరిరక్షణకు విస్తృత నాకాబందీ

శాంతిభద్రతల పరిరక్షణకు విస్తృత నాకాబందీ

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్ 8 (చైతన్యగళం):

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి వరకు విస్తృత నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ టౌన్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్లలోని ప్రధాన కూడళ్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో 3 మంది ఏసీపీలు, 15 మంది సీఐలు, 27 మంది ఎస్సైలు, 54 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లు, ట్రాఫిక్ విభాగానికి చెందిన 6 మంది సిబ్బంది, ఎస్‌ఏటీ విభాగానికి చెందిన 6 మంది ఎస్సైలు, 18 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్‌లో ఎన్టీఆర్ జంక్షన్, బోట్ జంక్షన్, బస్టాండ్, గీతాభవన్ సెంటర్, పద్మానగర్ జంక్షన్, ఆదర్శ్‌నగర్ తదితర ప్రాంతాల్లో, కరీంనగర్ రూరల్‌లో బొమ్మకల్, తీగలగుట్టపల్లి, రేకుర్తి, అలుగునూర్, చింతకుంట, మానకొండూర్, గంగాధర తదితర ప్రాంతాల్లో, హుజూరాబాద్ డివిజన్‌లో హుజూరాబాద్, పరకాల క్రాస్ రోడ్, కేశవపట్నం, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు అనుమానాస్పద వాహనాలను ఆపి వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్సులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!