శాంతిభద్రతల పరిరక్షణకు విస్తృత నాకాబందీ
కరీంనగర్, అక్టోబర్ 8 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి వరకు విస్తృత నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ టౌన్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్లలోని ప్రధాన కూడళ్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 3 మంది ఏసీపీలు, 15 మంది సీఐలు, 27 మంది ఎస్సైలు, 54 మంది...