Thursday, October 8, 2026
Homeతెలంగాణకరీంనగర్చికిత విజయం మా ఊరికే గర్వకారణం

చికిత విజయం మా ఊరికే గర్వకారణం

📰 Generate e-Paper Clip

  • అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై సత్తా చాటిన క్రీడాకారిణికి ఘన సన్మానం: సర్పంచ్‌ కవ్వంపల్లి బాపయ్య

ఎలిగేడు, అక్టోబరు 8 (చైతన్యగళం‌): అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై సత్తా చాటి భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితకు గ్రామపంచాయతీ పాలకవర్గం ఘన స్వాగతం పలికింది. హైదరాబాద్‌కు వచ్చిన చికితతో పాటు ఆమె తల్లిదండ్రులను సన్మానించింది.

ఈ సందర్భంగా సర్పంచ్‌ కవ్వంపల్లి బాపయ్య మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చికిత ప్రతిభ, కఠోర శ్రమ, పట్టుదలతో ప్రపంచస్థాయికి ఎదగడం గ్రామానికే గర్వకారణమన్నారు. తండ్రి కలను సాకారం చేస్తూ చికిత సాధిస్తున్న విజయాలు ప్రశంసనీయమని, ఆమె విజయాల వెనుక తండ్రి ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల త్యాగాలు ఎంతో ఉన్నాయని కొనియాడారు.

2025లో కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ యువజన చాంపియన్‌షిప్‌లో అండర్‌–21 మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో చికిత స్వర్ణ పతకం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫైనల్లో కొరియాకు చెందిన పార్క్‌ యెరిన్‌పై 142–136తో విజయం సాధించి ప్రపంచ జూనియర్‌ టైటిల్‌ సాధించిన తొలి భారతీయ మహిళా కాంపౌండ్‌ ఆర్చర్‌గా గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు.

చికిత ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్‌ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!