Wednesday, October 7, 2026
Homeతెలంగాణకరీంనగర్2027లోగా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి - మంత్రి పొన్నం ప్రభాకర్‌

2027లోగా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి – మంత్రి పొన్నం ప్రభాకర్‌

📰 Generate e-Paper Clip

అక్కన్నపేట, అక్టోబరు 6 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గ చిరకాల వాంఛ అయిన గౌరవెల్లి ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేసి త్వరలోనే సాగునీరు అందిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కోహెడ మండలం శ్రీరాములపల్లిలో నిర్వహించిన ‘పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని తెలిపారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులకు రైతులందరూ సహకరించాలని మంత్రి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!