Wednesday, November 4, 2026
Homeతెలంగాణమూడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

మూడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, నవంబర్ 3 (చైతన్యగళం):

హుస్నాబాద్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

ఎల్‌నినో ప్రభావంతో ఆయా మండలాల్లో సరైన వర్షాలు కురవక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని, రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఇప్పటికే రెండు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారని, మిగిలిన మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలని కోరారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయా గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!