Tuesday, November 3, 2026
Homeతెలంగాణమున్సిపల్ సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్‌కు బీజేపీ నేతల వినతి.. వీధి దీపాలు, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై ఫిర్యాదు

మహబూబాబాద్, నవంబర్ 2 (చైతన్యగళం):

మానుకోట మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ పట్టణ ఇన్‌చార్జి, వైస్ ఎంపీపీ ఎల్ది మల్లయ్య గౌడ్ డిమాండ్ చేశారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌కు పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మల్లయ్య గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మురుగుకాల్వలు మురికి కూపాలుగా మారడంతోపాటు పారిశుధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా పట్టణంలో పారిశుధ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని అన్నారు. ఉన్న కార్మికుల్లో కొందరిని అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో వ్యక్తిగత పనులకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, ఇది బాధాకరమని విమర్శించారు. విలీన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, పట్టణంలోని అన్ని వార్డులకు మిషన్ భగీరథ ద్వారా నిరంతర తాగునీటి సరఫరా అందించాలని కోరారు.

మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మల్లయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యాం శర్మ, సీనియర్ నాయకులు ముల్లంగి ప్రతాప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దార ఇందుభారతి, నాయకులు చుక్కల నరేష్, దగ్గుల సుజాత, సురేష్, డెంకని నర్సయ్య గౌడ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!