Saturday, October 3, 2026
Homeతెలంగాణకరీంనగర్బల్దియా అభివృద్ధి పనులను తనిఖీ చేసిన కమిషనర్

బల్దియా అభివృద్ధి పనులను తనిఖీ చేసిన కమిషనర్

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం):

పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు.

నగరపాలక సంస్థ ఆవరణలోని నూతన భవనం రెండో అంతస్తు, వెల్‌నెస్ సెంటర్, లైబ్రరీ, సానిటేషన్ స్టోర్ షెడ్ల నిర్మాణ పనులను శుక్రవారం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నందున ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ఉద్యోగ సిబ్బందికి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ లైబ్రరీ, వెల్‌నెస్ సెంటర్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. త్వరలోనే పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారి, ఏఈ సతీష్, సంబంధిత కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!