కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం):
గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అధికారులు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘన నివాళులునిరాడంబరత, నిజాయతీతో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం ఇప్పటికీ ప్రజల్లో స్ఫూర్తి నింపుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఏవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
