బల్దియా అభివృద్ధి పనులను తనిఖీ చేసిన కమిషనర్
కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం): పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆవరణలోని నూతన భవనం రెండో అంతస్తు, వెల్‌నెస్ సెంటర్, లైబ్రరీ, సానిటేషన్ స్టోర్ షెడ్ల నిర్మాణ పనులను శుక్రవారం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నందున ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేసి...