ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. ఉద్యోగులే ప్రభుత్వానికి ప్రతినిధులు: సీఎం రేవంత్రెడ్డి
కరీంనగర్, సెప్టెంబరు 30 (చైతన్యగళం): సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు పూర్తిస్థాయిలో అందేలా ఉద్యోగులు పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. బుధవారం కరీంనగర్లో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేది ఉద్యోగులేనని సీఎం అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డపేరు వచ్చినా అందులో ఉద్యోగుల పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని,...