Wednesday, September 30, 2026
Homeతెలంగాణమాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థినులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాటి నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ వి. లలిత మాట్లాడుతూ విద్యార్థినులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, పట్టుదలతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. సమాజంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కోరారు.

కళాశాల విద్యార్థి సలహాదారు, మాదకద్రవ్యాల నిర్మూలన సమన్వయకర్త టి. నిర్మలాదేవి, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమ అధికారి డి. కర్ణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!