- ‘వికసిత్ భారత్–2047’పై విద్యార్థుల సృజనాత్మకత
ఎల్కతుర్తి, సెప్టెంబరు 28 (చైతన్యగళం): బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు మంత్రి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన, కార్యక్రమ కన్వీనర్ పల్లెపాటి మధుకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
‘వికసిత్ భారత్–2047’ లక్ష్యంగా దేశ భవిష్యత్తుపై విద్యార్థులు తమ ఆలోచనలు, ఆకాంక్షలను ఉపన్యాసాలు, చిత్రాల రూపంలో వ్యక్తం చేశారు. సాంకేతికత, శాస్త్ర పరిశోధనలు, ఆధునిక వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలను వారు ప్రస్తావించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకత భవిష్యత్ భారత నిర్మాణంలో కీలకమన్నారు. ప్రతి విద్యార్థి నైపుణ్యాన్ని పెంపొందించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రశంసాపత్రాలు, పాల్గొన్న విద్యార్థులకు పెన్సిల్ స్కెచ్‌లు అందజేశారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు చీదురాల వెంకటేష్, అల్లి కుమార్, జనగాని కిష్టయ్య, గడ్డం మధుకర్‌రెడ్డి, వెళదండి రాజేందర్, గూడెం నాగరాజు, పోలు శివసేన, ఉపాధ్యాయులు నర్సింహులు, సుధాకర్, శ్రీధర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
