మోడల్ స్కూల్‌లో ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు
‘వికసిత్ భారత్–2047’పై విద్యార్థుల సృజనాత్మకత ఎల్కతుర్తి, సెప్టెంబరు 28 (చైతన్యగళం): బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు మంత్రి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన, కార్యక్రమ కన్వీనర్ పల్లెపాటి మధుకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యంగా దేశ భవిష్యత్తుపై విద్యార్థులు తమ ఆలోచనలు, ఆకాంక్షలను ఉపన్యాసాలు, చిత్రాల రూపంలో వ్యక్తం చేశారు. సాంకేతికత, శాస్త్ర పరిశోధనలు, ఆధునిక వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్య,...