Tuesday, September 29, 2026
Homeతెలంగాణకరీంనగర్భగత్‌సింగ్‌ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలి - ఏఐవైఎఫ్‌ నాయకుల పిలుపు

భగత్‌సింగ్‌ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలి – ఏఐవైఎఫ్‌ నాయకుల పిలుపు

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): షహీద్‌ భగత్‌సింగ్‌ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఏఐవైఎఫ్‌ మండల అధ్యక్షుడు దొంతరబోయిన రజిత, కార్యదర్శి జాగీర్‌ సాయి పిలుపునిచ్చారు. సోమవారం అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో భగత్‌సింగ్‌ జయంతి నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భగత్‌సింగ్‌ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా గొప్ప ఆలోచనాపరుడిగా, సామాజిక అసమానతలను ప్రశ్నించిన విప్లవకారుడిగా యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. యువత విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై చైతన్యంతో స్పందించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో హక్కుల కోసం పోరాడాలని సూచించారు.

భగత్‌సింగ్‌ ఆలోచనలను అధ్యయనం చేసి సమానత్వం, సామాజిక న్యాయం కోసం పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గొర్ల రాజు యాదవ్‌, గుగులోతు శ్రీకాంత్‌ నాయక్‌, బానోత్‌ శ్రీనివాస్‌, సంపత్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!