Wednesday, September 30, 2026
Homeతెలంగాణఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పోరుబాట

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పోరుబాట

📰 Generate e-Paper Clip

  • కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా.. సమగ్ర విచారణకు డిమాండ్‌

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ నిరసన గళం వినిపించింది. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజేష్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతిత్వం అత్యంత కీలకమన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు వాస్తవాలను వెల్లడించడంతో పాటు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం పెంపొందించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి

ఎస్‌ఐఆర్‌పై సమగ్ర సమీక్ష నిర్వహించి అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఠాగూర్‌ బాలాజీసింగ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, కల్వకుర్తి బ్లాక్‌ అధ్యక్షుడు కాయితి విజయకుమార్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతీలాల్‌ నాయక్‌, మాజీ ఎంపీపీ రామనాథం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, కుంద మల్లికార్జున్‌, చింతల రాజగోపాల్‌, కొయ్యల పుల్లయ్యతో పాటు బ్లాక్‌, మండల అధ్యక్షులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!