ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ పోరుబాట
కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా.. సమగ్ర విచారణకు డిమాండ్ నాగర్‌కర్నూల్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ నిరసన గళం వినిపించింది. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతిత్వం అత్యంత...