హైదరాబాద్, నవంబర్ 12 (చైతన్యగలం):
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సజ్జనర్‌ను అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ డీజీగా బదిలీ చేశారు. అదనంగా ఎస్పీఎఫ్ డీజీ బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియమితులయ్యారు.
ఇతర నియామకాల్లో ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా అనిల్ కుమార్, జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, మహిళా భద్రతా విభాగం డీజీగా సౌమ్య మిశ్రా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డి, అవినీతి నిరోధక శాఖ డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు.
ట్రైనింగ్ అదనపు డీజీగా సంజయ్‌కుమార్ జైన్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు, రైలు భద్రతా విభాగం డైరెక్టర్‌గా స్టీఫెన్ రవీంద్ర, అదనపు డీజీ (శాంతిభద్రతలు)గా అకున్ సబర్వాల్, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.
మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ, రైల్వేస్ ఐజీగా కె. రమేశ్ నాయుడు, టీజీ-టీమార్స్‌లో రోడ్డు భద్రత జాయింట్ డైరెక్టర్‌గా జోయల్ డేవిస్, జోన్-7 డీఐజీగా జి. చందన దీప్తి, జోన్-2 డీఐజీగా కె. నారాయణ నాయక్, డీఐజీ కో-ఆర్డినేషన్, జోన్-6 డీఐజీగా ఎల్.ఎస్. చౌహన్ నియమితులయ్యారు. డీఐజీ ఇంటెలిజెన్స్‌గా ఆర్. భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
