Friday, November 13, 2026
Homeతెలంగాణకరీంనగర్సొసైటీ రుణాల వసూళ్ల పేరుతో రైతులను వేధించొద్దు

సొసైటీ రుణాల వసూళ్ల పేరుతో రైతులను వేధించొద్దు

📰 Generate e-Paper Clip

  • జప్తు నోటీసులు ఉపసంహరించుకోవాలి.. నిర్బంధ వసూళ్లు నిలిపివేయాలి: కవ్వ వేణుగోపాల్‌రెడ్డి

హుస్నాబాద్, నవంబర్ 12 (చైతన్యగళం):

సొసైటీ రుణాల వసూళ్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, నిర్బంధ వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో రైతులకు జారీ చేసిన భూమి జప్తు నోటీసులను తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించడం ద్వారా వారిని మానసిక ఆందోళనకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన జప్తు నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సొసైటీ అధికారులతో పాటు ఇన్‌చార్జి పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్డీఓ, తహసీల్దార్లు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతులకు జప్తు నోటీసులు జారీ చేసి, వాటిని కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ విషయం కలెక్టర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం దెబ్బతిని రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకు అధికారులతో రుణాల రీషెడ్యూల్‌పై చర్చించినట్లు ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో సొసైటీ అధికారులు రైతులపై రుణాల వసూళ్ల ఒత్తిడి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన రుణాల రీషెడ్యూల్ విధానం హుస్నాబాద్ రైతులకు వర్తించదా అని నిలదీశారు.

రుణాల వసూళ్ల పేరుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేయవద్దని, నిర్బంధ వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని కవ్వ వేణుగోపాల్‌రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడితే అందుకు సంబంధిత సొసైటీ అధికారులు, ఇన్‌చార్జి పాలకవర్గమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!