Friday, November 13, 2026
Homeతెలంగాణకరీంనగర్ఎల్‌నినోపై కేరళ పాఠశాల విద్యార్థుల చైతన్య ర్యాలీ

ఎల్‌నినోపై కేరళ పాఠశాల విద్యార్థుల చైతన్య ర్యాలీ

📰 Generate e-Paper Clip

  • వాతావరణ మార్పులు, నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన

హుస్నాబాద్, నవంబర్ 12 (చైతన్యగళం):

ఎల్‌నినో వాతావరణ దృగ్విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్ పట్టణంలోని కేరళ ఈ/ఎం హైస్కూల్ విద్యార్థులు గురువారం చైతన్య ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పులు, నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్‌, ప్రిన్సిపల్‌ బుర్ర రాజేందర్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ దృగ్విషయమని తెలిపారు. దీని ప్రభావంతో భారతదేశంలో వర్షపాతం తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడటం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని వివరించారు. వ్యవసాయ రంగంపై ప్రభావం పడటంతో పాటు నీటి కొరత కూడా ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

అయితే ఎల్‌నినో ప్రభావం ప్రతిసారీ ఒకే విధంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌నినోకు వ్యతిరేకంగా పనిచేసే మరో వాతావరణ దృగ్విషయం లా నినా అని వివరించారు. వాతావరణ మార్పులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ అల్లే శైలేందర్‌, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!