Sunday, September 27, 2026
Homeతెలంగాణసోమేశుని గుడి వద్ద కుక్క మృతదేహం

సోమేశుని గుడి వద్ద కుక్క మృతదేహం

📰 Generate e-Paper Clip

  • వెంటనే తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి

కోహెడ, సెప్టెంబరు 26 (చైతన్యగళం): మండలంలోని సోమేశుని గుడి వద్ద కుక్క మృతదేహం పడి ఉండటంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో మృతదేహం ఉండటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మృతదేహాన్ని వెంటనే తొలగించి, పరిసరాలను శుభ్రం చేయాలని సంబంధిత గ్రామ సిబ్బందిని కోరారు. ఇలాంటి సమస్యలపై బాధ్యత ఎవరిదన్న దానిపై స్పష్టత ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!