విజయపురి కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): బైరామల్‌గూడ, కర్మన్‌ఘాట్‌ పరిధిలోని విజయపురి కాలనీలో సౌజన్య శాంతినికేతన్‌ పాఠశాల వద్ద వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి నిర్వహించారు. కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రూ.45,001కు లడ్డూ పూజల అనంతరం నిర్వహించిన గణపతి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. గోవిందు కిరణ్‌ రూ.45,001కు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను అభినందించారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో...