Thursday, September 24, 2026
Homeతెలంగాణదానం నాగేందర్‌కు సుప్రీం షాక్‌

దానం నాగేందర్‌కు సుప్రీం షాక్‌

📰 Generate e-Paper Clip

  • హైకోర్టు తీర్పులో జోక్యం ఉండదు.. పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ, సెప్టెంబరు 24 (చైతన్యగళం): ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ దానం నాగేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

దానం నాగేందర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. నాగేందర్‌ తిరిగి తన పాత పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఆయనపై పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం, చట్టసభ సభ్యత్వాన్ని కొనసాగించడం వేర్వేరు అంశాలని ధర్మాసనం స్పష్టం చేసినట్లు న్యాయ నివేదికలు వెల్లడించాయి.

2023లో బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణ హైకోర్టు ఆయనను రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ కింద అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్‌ 23 నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు పేర్కొంది.

హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు తమకు కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారినట్లయింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!