రాజీవ్నగర్లో ఘనంగా మహా అన్నదానం
కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దానగాళ్ల యాదగిరి బోడుప్పల్, సెప్టెంబరు 23 (చైతన్యగళం): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోడుప్పల్ రాజీవ్నగర్ కాలనీ యూత్ వింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దానగాళ్ల యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దానగాళ్ల యాదగిరి మాట్లాడుతూ.. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని అన్నారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన గడ్డి రమేష్, నాగరాజులను అభినందించారు. అనంతరం యూత్ వింగ్ కమిటీ సభ్యులు దానగాళ్ల...