Thursday, September 24, 2026
Homeతెలంగాణలక్కీ డ్రాలో పాత్రికేయుడికి లడ్డూ

లక్కీ డ్రాలో పాత్రికేయుడికి లడ్డూ

📰 Generate e-Paper Clip

  • ఐదు కిలోల లడ్డూ గెలుచుకున్న సీనియర్‌ పాత్రికేయుడు ముతికెల శ్రీధర్‌

ఎలిగేడు, సెప్టెంబరు 23 (చైతన్యగళం): సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని జవహర్‌నగర్‌ కాలనీలో భవాని యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు ముతికెల శ్రీధర్‌ ఐదు కిలోల లడ్డూను గెలుచుకున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో గణనాథుడికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని ఎలాంటి తారతమ్యాలు లేకుండా భక్తులకు అందించాలనే ఉద్దేశంతో నగదు కూపన్ల ద్వారా లక్కీ డ్రా నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకున్న శ్రీధర్‌కు ఉత్సవ కమిటీ సభ్యుల సమక్షంలో ప్రసాదాన్ని అందజేశారు.

కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఆకుల కరుణాకర్‌, ఆకుల అంజయ్య, భవాని యూత్‌ క్లబ్‌ సభ్యులు ఆకుల విష్ణువర్ధన్‌, డి.మధు, కొయ్యడ సాయి, శివకుమార్‌, ఆకుల సందీప్‌, ఆకుల జయవర్ధన్‌, శెట్టి శ్రీనివాస్‌, దేవానంద్‌, సాయికిరణ్‌, పూజారి సాయినాథ్‌తో పాటు ఇతర యూత్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!