Sunday, September 13, 2026
Homeసంపాదకీయంపెద్దపల్లి లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

పెద్దపల్లి లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, ఆగస్టు 13 (చైతన్య గళం):
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో గురువారం అంగరంగ వైభవంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ సాగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హాజరై జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీగా కదిలారు. పట్టణ వీధుల్లో 500 మీటర్ల పొడవైన తిరంగా జెండా కదిలి వస్తున్న దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యతను చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, “వికసిత భారత్ కోసం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి, దేశభక్తిని పెంపొందించుకోవాలి” అని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!